Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- ఘనంగా పటాన్చెరు ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ ప్రారంభం
- రూ.రెండు కోట్లా 25 లక్షల విరాళం అందించిన జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్
నవతెలంగాణ - పటాన్చెరు
ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసు కుంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధి కి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూ డెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్ర మైన పటాన్చెరులో గురువారం జీవీఆర్ ఎంటర్ప్రైజె స్ సంస్థ సౌజన్యంతో రూ. రెండు కోట్లా 25 లక్షల వ్యయంతో నిర్మించిన ముస్లిం మైనార్టీ ఫంక్షన్ హాల్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మైనార్టీ పెద్ద లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భ ంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ నిరుపేద ప్రజలు తమ వివాహాది శుభకార్యా లను అతి తక్కువ ఖర్చుతో చేసుకునేలా నియోజక వర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు పట్ట ణంలో పేద ప్రజల కోసం ఏడు ఫంక్షన్ హాళ్లు నిర్మిం చామని అన్నారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి నిమిత్తం వేలమంది ప్రజలు వచ్చి జీవనం సాగిస్తున్నారని, వారందరినీ కాపాడుకోవాల్సిన బా ధ్యత మనపై ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికలకు స్థలం సరిపోవడం లేదని, త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి సమస్య పరి ష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రత్యేక తెలం గాణ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు సమ ప్రాధా న్యతనిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమ ని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధి ంచిన అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ఐనోల్ గ్రామ సమీపంలో రెసిడెన్షియల్ హబ్ ఏర్పాటు చే యనున్నామని తెలిపారు. అనంతరం ముస్లిం మైనా ర్టీ పెద్దలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతు లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎమ్మెల్యే జిఎం ఆర్ సతీమణి గూడెం యాదమ్మ, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజరు భాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్, డిఎస్పి భీమ్ రెడ్డి, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి,మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీని యర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెం కట్ రెడ్డి, విజరు కుమార్, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, వాజీధ్ అలీ, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి 'మన ఊరు.. మన బడి'
ప్రభుత్వ విద్యావ్యవస్థలో మన ఊరు మన బడి కార్యక్రమం నూతన ఒరవడిని సష్టిస్తోందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నా రు. పటాన్చెరు పట్టణంలోని మండల పరిషత్ ప్రా థమిక బాలుర, బాలికల పాఠశాలలో గురువారం రూ. 44 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప లు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జీఎంఆర్ శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 55 పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మం డల విద్యాధికారి రాథోడ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.