Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్
నవతెలంగాణ-రాయపోల్
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణ యజ మానులు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి రైతులను మోసం చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ హెచ్చరించారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం రెండవ ఆరోగ్య రైతు సేవ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం విత్తనాలు వేసే సమయం ఆసన్నం కావడంతో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రా లు, ఫర్టిలైజర్ యజమానులు రైతుల అవసరాలను గుర్తించి నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను విక్రయిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండవ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో విత్తనాల నిల్వలు, ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టరులు, బిల్ బుక్ తనిఖీ, స్టాక్ బోర్డు ఏర్పాటు వంటి అంశాలపై డీలర్ కు అవగాహన కల్పించి వాటిని ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. విత్తనా లు, ఎరువులకు సంబంధించి బిల్ రసీదులు తప్పనిసరిగా రైతులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో జగదీష్, ఏఈవో ప్రశాంత్, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం డీలర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.