Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యు ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ
నవతెలంగాణ-చేర్యాల
విద్యార్థి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పీడీఎస్‌యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నామని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ తెలిపారు. స్థానిక గాంధీ విగ్రహం ఎదుట పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ప్రగతి భవన్ ముట్టడికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో జిల్లాల పునర్విభజన అనంతరం బిశ్వాల్ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన ఉద్యోగ ఖాళీల లెక్క ప్రస్తుతం మూడింతలు పెరిగిందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించగానే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లు వేలాది రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేస్తున్నారని, తక్షణమే వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ప్రతి మండల కేంద్రంలో ఉచిత కోచింగ్ సెంటర్లు నెలకొల్పి నిరుద్యోగులకు వసతి కల్పించాలని కోరారు. దరఖాస్తు ఫీజును రద్దుచేసి, ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ వసతి గృహ విద్యార్థు లకు మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే పెంచాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సభ్యుడు రాహుల్, పీవైఎల్ నాయకుడు కొంపల్లి విజరు కార్తీక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.