Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం గండి మైసమ్మ బౌరం పేట్ ప్రాంతానికి చెందిన నిరుపేద రాయలపురం అనిత, రమేష్ దంపతుల కూతురి వివాహానికి గురువారం పటాన్చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు రూ. పదివేల ఆర్థిక స్థాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యువతి కుటుంబీకులు, బంధువులు నారా బోయిన శ్రీనివాస్ బందం సర్పంచ్ నీలం మధుకు కతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిన్నారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నారా బోయిన, ర బోయిన శ్రీనివాస్ ,బాబు ,బిక్షపతి ,నవీన్ ,గోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రానికి చెందిన నిరుపేద మంగలి రాజు చెల్లెలు వివాహానికి గురువారం బీజేపీ సంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వంగవీటి ప్రతాప్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రాజు కుటుంబీకులు ఆయనకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరి నరసింహారెడ్డి ,రాజు తదితరులు పాల్గొన్నారు .