Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
- పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
- సీఐటీయూ ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు
- సుందరయ్య స్ఫూర్తితో యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు
నవతెలంగాణ-మెదక్ డెస్క్
పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప నిచేసిన మహౌన్నత నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉ ద్యమ నేత, సాయుధ తెలంగాణ పోరాట యో ధులు, కార్మిక పక్షపాతి పుచ్చలపల్లి సుందర య్య 37వ వర్థంతి సందర్భంగా గురువారం స ంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మ ల్లేపల్లి గ్రామంలో సీఐటీయూ యూనియన్ల ఆ ధ్వర్యంలో సహపంక్తి భోజనాలు నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి హాజరైన చుక్క రాము లు మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుంద రయ్య భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాల లో కూలీలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహి ంచారని అన్నారు. సామాజిక సమస్యలపై ఎ ప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వివక్ష రూపా లు ఉండకూడదని పోరాడిన నాయకుడని గు ర్తు చేశారు. గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మి కులు, పట్టణ ప్రాంత కార్మికుల హక్కుల కోసం అనేక అంశాలపై ప్రభుత్వాలను చట్టసభలో ప్ర శ్నించాడని తెలిపారు. తెలంగాణ రైతాంగ పో రాటం నాయకత్వం వహించి 3000కు పైగా గ్రామాల్లో 10వేల ఎకరాల భూమిని పంపిణీ చేశాడన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి మనుషులంతా ఒక్కటేనని దళితుల కుటుంబా లలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి భూ స్వామ్య వ్యవస్థను ఎదురించిన నాయకుడని కొనియాడారు. తన జీవితాన్ని ప్రజలకు అం కితం చేసిన నిస్వార్థ నాయకుడు, త్యాగధను డని ఆయన ఆశయాలు రానున్న రోజుల్లో సీఐ టీయూ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కొనసాగి స్తానని తెలిపారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పోషిస్తూ ప్రజలు, కార్మికుల మధ్య కులం మతం పేరుతో చిచ్చు పెడుతోందని ఈ విధానాలకు వ్యతిరేకంగా కా ర్మిక వర్గం ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీ. మల్లేష్, ఉపాధ్యక్షులు పీ.బాగా రెడ్డి, కోశాధికారి జీ.సాయిలు, వివిధ యూనియన్ల నాయకులు సుధాకర్, రమేష్, రాందాస్, మోహన్ రెడ్డి, కొండల్ రెడి,్డ శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్, యాకత్ ,అలీ, దయానంద్, రవి, కార్మికులు, బస్తీ ప్రజలు, తదతరులు పాల్గొన్నారు.
పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని గురువారం సీఐటీయూ సంగారెడ్డి జిల్లా క మిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా అధ్యక్షులు మల్లేశం సుందరయ్య చి త్రపటానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భా రత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, వీర తెలం గాణ సాయుధ పోరాట యోధుడు, స్వతంత్ర భారత పార్లమెంటులో మొదటి ప్రతిపక్ష నా యకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. ఆయన బాటలో నడవడమే ఆయన కు మనమిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సా యిలు, యాదగిరి కార్యకర్తలు పాల్గొన్నారు.
అమీన్పూర్:సమాజంలో సంపద అంద రికీ చెందాలని కోరుకున్న గొప్ప వ్యక్తి సుందర య్య అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సీఐటీయూ అమీన్పూర్ మండల కమిటీ ఆధ్యర్యంలో గురువారం పు చ్చల పల్లి సుందర య్య 37వ వర్థంతి సభను బీరంగుడ విజేత మార్కెట్ పక్కన నిర్వహిం చారు. ఈసభకు ముందుగా పుచ్చలపల్లి సుం దరయ్య చిత్ర పటానికి ఆయన పూల మాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు.అనంతరం మా ట్లాడుతూ.. పుట్టడం ఎవ్వరి చేతులో లేదు ఒక వేళ అది ఉంటే నేను దళిత కులంలోనే పుట్టా లని కోరుకుంటానని చెప్పిన మహామనిషి సుం దరయ్య అని కొనియాడారు. మొట్ట మొదటి వ్యవసాయ కార్మిక సంఘాన్ని తన ఇంట్లో నుండే మొదలు పెట్టిన వ్యక్తి అని తెలిపారు. అన్ని రకాల ఆధిపత్యాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి సుందరయ్య అని, పార్లమెంట్ లో ప్రతి పక్ష నాయకుడిగా ప్రజల తరపున పనిచేసిన వ్యక్తి అని గుర్తుచేశారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సీనియర్ నా యకులు పాండురంగారెడ్డి, పటాన్చెరు సిపిఎం పార్టీ డివిజన్ సెక్రెటరీ నరసింహారెడ్డి, అమీ న్పూర్ మండలం సిఐటియు నాయకులు శ్రీని వాస్ రెడ్డి, జార్జ్, వీరస్వామి,ఐద్వా నాయకు రాలు, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు, భ్రమ రాంబిక నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియే షన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
జోగిపేట:కామ్రేడ్ పుచ్చలపల్లి సుందర య్య స్ఫూర్తితో యువత పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు రాజయ్య పిలపునిచ్చారు. సుందరయ్య 37వ వర్థంతి సందర్భంగా గురువారం జోగి పేట సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏరియా క మిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం నిర్వ హించిన సభలో ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత దేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, పేద ప్రజల ఆశాజ్యోతి సుందరయ్య ప్రజా జీవితం ప్రజా సేవకులకు, భావి పౌరులకు ఒక మహౌన్నత సందేశమని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన గొప్ప విప్లవ వీరుడు ప్రజలే ప్రాణంగా ఊపిరి ఉద్య మంగా దొరలకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజలకు కడదాకా అండగా ఉన్న వ్యక్తి సుంద రయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో సీపీ ఐ(ఎం) మండల కన్వీనర్ విద్యాసాగర్, నా యకులు కృష్ణ రాములు, వసంత కుమార్, సుధాకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ :తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, స్వతంత్ర సమర యోధుడు, సీపీఐ(ఎం) తొలి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) జహీరాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శి బీ. రా మచందర్ అన్నారు. గురువారం సుందరయ్య 37వ వర్ధంతి సందర్భంగా శ్రామిక్ భవన్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భూస్వాములకు, నైజాంకు వ్యతిరేకంగా వీరో చిత పోరాటంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయుడు సుందరయ్యని అన్నారు. భూ మి లేని నిరుపేదలకు వేల ఎకరాల భూమిని పంచిన ఘనత ఆయనకు, కమ్యూనిస్టు పార్టీకే దక్కుతుందని తెలిపారు. ఈ పోరాటానికి నా యకత్వం వహించిన సుందరయ్య స్ఫూర్తితో జహీరాబాద్ ప్రాంతంలో కూడా అనేక ఉద్య మాలు నిర్వహిస్తామని, పేదల సమస్యల పరి ష్కారానికి ఉద్యమాలు చేపడతామని అన్నారు. అనంతరం బాగా రెడ్డి పల్లెల్లో సహపంక్తి భోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఏస్. మహిపాల్, నర్సయ్య, మూర్తి, రాజి రెడ్డి, వీరయ్య గౌడ్, సంగన్న, తదితరులు పాల్గొన్నారు.