Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పొట్టి ప్రవీణ్ కుమార్
- 23నతహసిల్దార్ కార్యాలయ ముట్టడిని జయ ప్రదం చేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-నారాయణఖేడ్
ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అందజేయాలని, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా లబ్దిదా రుల ఎంపిక అధికారుల ద్వారానే చే యాలని కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పొట్టి ప్రవీణ్ కుమార్ ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల ంలో దళితులు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23న మండల కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్ర దం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందు కు సంబంధించిన కరపత్రాన్ని గురు వారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో విడుద ల చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ దళిత బంధు పథకం ద్వారా ఒ క్కొక్క దళిత కుటుంబానికి పూర్తి స బ్సిడీతో రూ.10 లక్షలు అందజే యనున్నట్లు 2021 జులైలో సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అ మలు చేస్తున్నారని తెలిపారు. కానీ లబ్దిదారుల ఎంపికలో రాజకీయ నా యకుల జోక్యం వల్ల అర్హులైన దళితు లకు నష్టం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారుల ద్వారానే లబ్దిదా రుల ఎంపిక చేయాలని, రెండో దఫా దళిత బంధు లబ్దిదారుల ఎంపికను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సం ఘాల నాయకులు పాల్గొన్నారు.