Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-మిరుదొడ్డి
రైతులు ప్రభుత్వం సూచించిన విధంగా ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేస్తున్న రైతులతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలతో పాటు డ్రిప్పు పరికరాలు అందించడం జరుగుతుందని వెల్లడించారు. రైతులు లాభసాటి పంటలపై మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఆయిల్ ఫామ్ పంటలు ప్రతి రైతు సాగు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పంటలకు మార్కెట్లో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంటలపై ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను రైతులు అడిగి తెలుసుకోవాలని సూచించారు. రైతుల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసెలు దగ్ధమైన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు జెడ్పీటీసీ లక్ష్మి లింగం జిల్లా డైరెక్టర్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ భాస్కరాచారితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు బాలరాజు శ్రీనివాస్, సిద్ది భారతి భూపతి గౌడ్, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు సుజాతతో పాటు ప్రజా ప్రతినిధులు, రైతులు పలువురు పాల్గొన్నారు.