Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-గజ్వేల్
ఇటీవల బాసర త్రిబుల్ ఐటీ విద్యాసంస్థలో జరిగిన ఫుడ్ ఫాయిజన్తో దాదాపు వెయ్యి విద్యార్థులు అనారోగ్యానికి గుర య్యారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని గజ్వేల్ నియోజకవర్గ బీఎస్పీ నాయకులు నరేష్, కర్ణాకర్ అన్నారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ త నెలలోనే వారం రోజులు పాటు ఎండ, వాన లెక్క చేయకుండా కనీస మౌలిక వసతుల కోసం 9 వేల మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లి హామీ ఇచ్చిన తర్వాత కూడా విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం చూస్తే తెలంగాణ విద్యార్థుల మీద ప్రభుత్వ కపట ప్రేమ కనిపిస్తోందన్నారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ బాసర ట్రిబుల్ ఐటీ కాలేజ్ వెళ్లి విద్యార్థులకు భరోసా ఇవ్వాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. మున్సిపల్ అధ్యక్షులు కోట మహేందర్, సెక్టార్ అధ్యక్షులు కనకప్రసాద్, నవీన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.