Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాల్కల్ : మండలంలోని రేజింతల్‌లో బీరప్ప ఆలయం, మిర్జాపూర్ (బి) గ్రామ దేవతల బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్దా అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆడ పడుచులు బోనాల ఊరేగింపు, నైవేద్యా లతో వీధుల గుండా భాజా భజంత్రీలతో వెళ్లి.. మొక్కులు చెల్లించుకున్నారు. పాడిపం టలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని గ్రామ దేవత లకు మొక్కుకున్నారు.
తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్) :
మనోహరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు. రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రసిడెంట్ చిట్కుల్ మహిపాల్‌రెడ్డి ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని మహంకాళి, ముత్యాలమ్మ, పోచమ్మ గ్రామ దేవతలకు మహిళాలు బోనాలను సమర్పించి మొక్కు లను తీర్చుకున్నారు. పోతరాజుల విన్యా సాలు, శివసత్తుల పూనకాలతో మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు.
నిజాంపేట : నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆదివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉపసర్పంచ్ రమేష్, నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవ త్సరం ఆషాడ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు తీస్తామని, గ్రామ దేవతలు చల్మెడ గ్రామాన్ని చల్లగా చూడాలని వేడుకున్నా మన్నారు. సర్పంచ్ నర సింహారెడ్డి, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహే ష్, నాగరాజు, బొమ్మల మల్లేశం పాల్గొన్నారు.
జోగిపేట : ఆషాడ మాస బోనాల సందర్భంగా జోగిపేట పట్టణంలోని 9వ వార్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద మహంకాళి అమ్మవారికి కౌన్సిలర్ గాజుల ధనలక్ష్మి అనిల్ కుమార్, కాలనీవాసులు శారదా, శరణప్ప, మానెమ్మ బోనాలు సమర్పించారు. 13వ వార్డు గడి మైసమ్మ దేవాలయం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బోనాలు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్ రంగ సురేష్, మాజీ ఎంపీటీసీ శంకర్, పూజారి వీరభద్రప్ప,వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మహేష్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పట్నం మురళి, ఆలయ కమిటీ సభ్యులు సోమేశ్వర్, కొషికే సత్యం, అశోక్ ఆర్ట్, విటల్, రాజు, రాములు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.