Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాముళ్ల మత్తులో అటవీ శాఖాధికారులు
- అనుమతులున్నాయని కలపను దాటవేస్తున్న దళారులు
- నెలకు రూ.1500 మామూళ్లిస్తున్నానని ఓ వ్యక్తి ఆరోపణ
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరివిగా మొక్కలు నాటాలని ప్రతిష్టాత్మకంగా పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్న అటవీశాఖాధికారులు మాత్రం యథేచ్చగా పెద్దపెద్ద వృక్షాల నరికివేతకు ఆజ్యం పోస్తున్నారని మండలంలో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అటవీశాఖాధికారుల అండదండల తో దళారులు పట్టపగలు యంత్రాల సహాయంతో యథేచ్చగా వృక్షాలను కోతకు గురిచేస్తున్న దృశ్యం మండల కేంద్రంలో అదివారం కనిపించింది. పలుకుబడి ఉన్న దళారులకే వత్తాసు పలుకుతూ అనుమతుల్లేకుండా హద్దులు దాటుతున్న అక్రమ కలప రవాణాకు అటవీశాఖాధికారులు సహయ సహ కారాలందిస్తున్నారని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. వృక్షాల నరికివేతకు అనుమతులు జారీ చేయడంలో కూడా పక్షపాత దోరణి అవలంభి స్తున్నారని, మాముళ్లు అందజేస్తున్న దళారులకు అట వీశాఖాధికారులు బాసటగా నిలుస్తూ చూసీచూడ నట్టు వ్యవహరిస్తున్నారని, దీంతో విలువైన కలప ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలివెళ్లుందని అవేదన వ్యక్తం చేశాడు. తానే నెలకు రూ.1500 మాముళ్ల రూపంలో అటవీశాఖాధికారులకు అంద జేస్తానని మండల కేంద్రానికి చెందిన స్థానికుడు విష్ణు తెలిపాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పలు కుబడి ఉన్న దళారులకే వత్తాసు పలుకుతున్న హు స్నాబాద్ డివిజన్ అటవీశాఖాధికారులపై జిల్లా అధికారులు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. వృక్షాలను కోతకు గురి చేస్తున్న గుత్తేదారును వివరణ అడుగగా అధికారుల అనుమతులున్నాయని తెలిపారు. గుత్తేదారు వివరణ తెలిపిన కొద్ది వ్యవధిలోనే అటవీశాఖాధికారి వచ్చి వృక్షాలను కోతచేసే యంత్రాలను స్వాదీనం చేసుకుని వెళ్లినట్టు సమాచారం. విష్ణు ఆరోపణలపై హుస్నాబాద్ ఉప అటవీశాఖాధికారి గోపాల్ రెడ్డిని వివరణ కోరగా వృక్షాల కోతకిచ్చిన అనుమతులను పరిశీలిస్తామని, కోత యంత్రాలను స్వాదీనం చేసుకున్నామని, పై అధికారుల ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు చేపడుతామని తెలిపారు.