Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా 3వ మహాసభలు
- తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి
నవతెలంగాణ-దుబ్బాక
అంగన్వాడీిలకు ప్రకటించిన సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడి యూనియన్ సిద్దిపేట జిల్లా 3వ మహాసభలు దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి హాజరై జెండావిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ మహాసభలకు జి.పద్మ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి పీ జయలక్ష్మి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లందరిని కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధాన చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ వ్యవస్థను, ఐసీడీఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని దానిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని కోరారు. దేశంలో గత 50 సంవత్సరాల క్రితం ఐసీడీఎస్ ప్రారంభించడానికి ప్రధాన కారణం దేశంలో మాతా శిశు మరణాల నిర్మూలన, పిల్లలకు పోషకాహార లోపాన్ని అధిగమించడం ముఖ్యమైన లక్ష్యంతో ఈ స్కీుం ప్రారంభమైందని, కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్రం పెంచిన వేతనం ఏరియర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించి ఐసీడీఎస్్ బలోపేతానికి కషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లపైన అనేక రకాల వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, అలాంటి వేధింపులను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు రూ.5 లక్షలు, హెల్పర్లకు రూ.3 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించి ఐసీడీఎస్ బలోపేతం, టీచర్స్, హెల్పర్స్ హక్కుల సాధనలో కొన్ని విజయాలు సాధించినా కూడా ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను మరింత నిర్వీర్యం చేయాలని కుట్రలు పన్నడం సరైన విధానం కాదని విమర్శించారు. ఐసీడీఎస్్ బలోపేతంతో కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలైన ప్రజలందరికీ పౌష్టికారాన్ని అందించాలన్నారు. మాతా శిషు మారణాల రేటును తగ్గించి దేశాన్ని ఉన్నత స్థాయిలో చేర్చడానికి ఐసీడీఎస్ ఎంతో కృషి చేస్తుందని, ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో టీచర్స్ అండ్ హెల్పర్స్ పెద్ద సంఖ్యలో పోరాటాలకు సిద్ధపడుతున్నారని ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ మహాసభల్లో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం పద్మ, జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్, సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎం నాగరాణి, భూలక్ష్మి, మాధవి, విజయ, రేణుక, బాబారు, బాల్ నర్శవ్వ, లక్ష్మీ, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.