Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా 1962వ బ్యాచ్ గెట్ టుగెదర్
- 31 మందికి 21 మంది హాజరు
నవతెలంగాణ-జహీరాబాద్
వాళ్లంతా వయోవృద్ధులు.. కాలంతో పాటే వయస్సూ దొర్లిపోతోంది. కానీ 1962 వరకూ సాగిన ఆ బాల్యస్నేహం మాత్రం.. 60 ఏళ్లైనా అలాగే ఉంది. కాదు కాదు ఫెవికాల్ బంధమై మరింత బలపడింది. ఎంతలా అంటే.. 60 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న ఊళ్లో మళ్ళీ కలిసి ఓ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకునేంతగా. జహీరాబాద్ వేదికగా.. ఆదివారం ఆ ఎస్సెస్సీ బ్యాచ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మే ళనం నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని. 60 సంవ త్సరాలు అయినా అదే ప్రేమ అదే పలకరింపులతో ఆత్మీయ సమ్మేళన సభ దద్దరిల్లింది. జహీరాబాద్ ప్రభుత్వ హై స్కూ ల్లో 1962లో హెచ్ఎస్ఎల్సి చదివిన పూర్వ విద్యార్థులు 60 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా వారు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇన్చార్జి ఎంఈఓ బసవరాజును ముఖ్యఅతిథిగా పిలిచారు. ఈ సందర్భంగా బసవరాజు మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నత పదవులను అనుభవించిన వారందరూ ఒక దగ్గర చేరి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వారి పిల్లలకు, మనవరాళ్లకు దిక్సూచిగా ఆత్మీయ సమ్మేళాన్ని నిర్వహించారు.మొత్తం 31 మంది ఉన్న విద్యార్థుల్లో 21మంది ఒక్క చోటికి చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకు న్నారు. పూర్వ విద్యార్థులు ఆర్.నాగన్న , బి.రాజయ్య, నాగమణి, ఎస్ చంద్రారెడ్డి, దిగంబర్ రావు కులకర్ణి, జయ కుమార్, మానికిరాజ్, దశరథ్, రాంరెడ్డి, బాలరెడ్డి, అంబన్న, రాచప్ప, విశ్వనాధం, నర్సింహారెడ్డి, పెంటారెడ్డి, బక్కన్నలు పాల్గొన్నారు. ఆ రోజుల్లో చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో.. కాలి నడకన, సైకిల్ తొక్కుకుంటూ గ్రామం నుంచి స్కూలుకు వచ్చిన రోజులను చెప్పుకున్నారు. తాము తప్పు చేస్తే కొట్టిన హెడ్ మాస్టర్ బడవనప్ప సార్ను తలుచ ుకున్నారు. తాము పాఠశాలలో విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో రాణించి రిటర్మెంట్ అనంతరం సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తమ చిన్న నాటి మిత్రులను సన్మానించారు. తమకు విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.