Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట
భారతీయ జనతా పార్టీ ఈ నెల 21 నుంచి చేపట్టనున్న పల్లె గోస-బీజేపీ భరోసా..బైక్ ర్యాలీలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి కోరారు. ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శివానుభవ మండపంలో జిల్లా పదాధికారులు మండల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేపట్టనున్న పల్లె గోస-బీజేపీ భరోసా కార్యక్రమం 20 రోజులపాటు కొనసాగుతుందని చెప్పా రు.14 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని టీఆర్ఎస్ వైపల్యా లను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకా లను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. 20 రోజులపాటు కొనసాగే పల్లె గోస-బీజేపీ భరో సా బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇంచార్జ్ అంజన్ కుమార్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, నాయకులు రాంచంద్రారావు, విద్యాసాగర్, బూరుగు సురేష్ గౌడ్, రోశయ్య, కోడూరి నరేష్, రాంరెడ్డి , నలగామ శ్రీనివాస్, శివకుమార్, పత్రి శ్రీనివాస్ యాదవ్, అరుణా రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.