Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ పథకాల ఎత్తివేతకు కుట్ర
- ఐసీడీఎస్ ప్రయిటీకరణకు మోడీ చూపు
- ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. రాజయ్య
నవతెలంగాణ-జోగిపేట
దేశంలో నరేంద్ర మోడీ నియంత పాలన కొనసాగి స్తున్నారని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే. రాజయ్య విమర్శించారు. ఆదివారం జోగిపేటలోని శ్రీరామ గార్డెన్లో నిర్వహించిన జిల్లా అంగన్వాడి అండ్ హెల్పర్స్ యూ నియన్ మూడో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. కార్మిక చట్టాలకు సవరణలు చేస్తూ వారి హక్కులను కాలరా స్తున్నా రన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎత్తివేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదన్నారు. మతోద్మానాన్ని పెంచి పోషిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం పాలన కొనసాగి స్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అమాం తంగా పెంచేస్తున్నారని, పెట్రోల్, డీజిల్ లను ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదని ప్రశ్నిం చారు. రాబో వు రోజుల్లో శ్రీలంక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ చట్టాల సవరణలపై పోరాటాల ఫలితంగానే కేంద్రం దిగొచ్చిందని, దాని స్ఫూర్తితో భవిష్యత్తులో పోరా టాలకు సిద్ధం కావాలన్నారు. ఐసిడిఎస్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టేం దుకు అంగన్వాడీ టీచరు,్ల హెల్పర్లు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది అన్నారు. వారి సమస్యల పరిష్కా రానికి చొరవ చూపడం లేదన్నారు. అంతకుముందు సీఐ టీయూ జెండాను ఆవిష్కరించి, ఇటీవల కాలంలో మతి చెందిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి సభను ప్రారంభించారు. ఈ మహాసభలో భవిష్యత్తు కర్తవ్యాలు, తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. సాయిలు, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి మంగ, అందోల్, పుల్కల్, పటా న్చెరు మండలాల సిఐటియు కార్యదర్శులు డి. విద్యాసాగర్, నాగభూషణం, నాగేశ్వరరావు, యూనియన్ నాయకురాలు అరుణ, రజిత, శేకమ్మా, తదితరులు పాల్గొన్నారు.