Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
ప్రజలకు సేవా దక్పథంతో డయాగ్నిక్ సేవలు అందించాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీ( రవీందర్ రెడ్డి ఆసుపత్రి)లో ఏషియన్ మెడికల్ డయాగస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని డయాగస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ ఇండియాగా పేరుగాంచిన పటాన్ చెరు పారిశ్రామికవాడలో డయాగస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవా దృక్పథంతో సేవలు అందించాలని సూచిం చారు. డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ శ్రీలక్ష్మిలు మాట్లాడుతూ.. తమ డయాగస్టిక్ సెంటర్లో ప్రజలకు అందుబాటులో ఉంటు సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. టీిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు. డయాగస్టిక్ సెంటర్ ఇంచార్జి రవి, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.