Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
- త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం
- 200 పడకలు, అత్యాధునిక వసతులు, ఆధునిక శస్త్ర చికిత్సలు
- ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్లకు కతజ్ఞతలు
నవతెలంగాణ-పటాన్చెరు
మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజక వర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంబం ధించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ 82 జారీ చేసింది. ఇందుకు రూ.184 కోట్ల 87 లక్షల 55 వేల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం వ్యయంలో 25శాతం అంటే రూ.46 కోట్ల 21 లక్షల 88 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 75శాతం అంటే రూ.138, 65,66 , 287లను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఖర్చు చేయనుంది. సివిల్ వర్క్స్ నిర్మాణం మరియు పరికరాలు, ఫర్నిచర్ మరియు ల్యాబ్ల సేకరణ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎస్ ఎంఎస్ ఐడిసి)కి అప్పగించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనిచేస్తున్నదని జీవోలో పేర్కొన్నారు. పటాన్చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పా టుకు ఇప్పటికే స్థలాన్ని సిద్ధం చేశారు.ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కనే గల రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేటాయించారు.మినీ ఇండి యాగా పేరుందిన పటాన్చెరు పారిశ్రామిక వాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ లకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మూలంగా వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభా గాలను, నిపుణులైన వైద్యులను నూతన ఆసుపత్రిలో ఏర్పా టు చేయనున్నారనీ చెప్పారు. ప్రధానంగా పరిశ్రమల్లో పని చేసే కార్మికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దష్టిలో ఉంచుకుని అందుకు అవస రమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కతజ్ఞతలు తెలిపారు.