Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-దుబ్బాక
రైతుబీమా మాదిరిగా నూతనంగా చేనేతబీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై తెలంగాణ పద్మశాలి సంఘం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, చేనేతల సంక్షేమం కోసం ప్రతి యేటా రూ.1,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయి స్తుందన్నారు. మంగళవారం దుబ్బాక లో తెలంగాణ పద్మశాలి సంఘం సిద్దిపేట డివిజన్ సెక్రెటరీ గాజుల తిరుపతి,టిపిఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరామ్ రామకష్ణ ప్రభు మాట్లాడారు. చేనేత, మరమగ్గ కార్మికు లకు ప్రమాదవశాత్తు సంభవించే మరణాలకు చేనేతబీమా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80 వేల మంది చేనేత, మరమగ్గాల కార్మికులకు రూ.ఐదు లక్షల చేనేత భీమా వర్తించనున్నట్లు చెప్పారు.మరమగ్గాల ఆధునీకరణ, చేనేతకు చేయూత పేరిట త్రిఫ్ట్ పథకాన్ని అందిస్తున్నదని వివరిం చారు. చేనేత మిత్ర ద్వారా రసాయ నాలకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీని అందిస్తుందని స్పష్టం చేశారు.చేనేత భీమా పథకానికి సంబంధించిన ప్రీమియం డబ్బులు రూ.50 కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్,రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డిలకు దుబ్బాక చేనేత సమాజం తరఫున ప్రత్యేక ధన్య వాదాలు తెలియజేశారు.కారంపూరి రవి,గోనె మధు,లక్ష్మీనారాయణ, తదితరులున్నారు.