Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల పట్టణంలో చికెన్, మటన్ షాపుల వ్యాపారులను కొంతమంది కౌన్సిలర్లతో పాటు కమిషనర్ రాజేంద్రకుమార్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళ వారం ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ జి.రాజేంద్ర కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు మాట్లాడుతూ చికెన్, మటన్ వ్యాపారులపై వేధింపులు మానుకొని వారికి ప్రత్యామ్నాయ షాపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేర్యాల పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ వద్ద అభివద్ధి పేరిట మటన్, చికెన్ వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారన్నారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన దుకాణ సముదాయం ఏర్పాటు చేయకపోగా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడారాలను సైతం తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దాసరి కళావతి, టీడీపీ యువత రాష్ట్ర అధికార ప్రతినిధి ఒగ్గు రాజు, నాయకులు ఎండీ. ఖాజా,రాళ్లబండి నాగరాజు,రాళ్లబండి భాస్కర్, చికెన్, మటన్ దుకాణాల సంఘం అధ్యక్షుడు ఖాజా తోపాటు వ్యాపారులు పాల్గొన్నారు.