Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పుల్కల్
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట్రల నుంచి భారీగా వరద నీరు రావడంతో సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా నిండి పరవళ్ళు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా మంగళవారం నాటికి ప్రాజెక్టులో 28 ల టీఎంసీల నీరు వచ్చి చేరడమే కాకుండా భారీ మొత్తంలో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై రెండు గేట్ల ద్వారా సుమారు మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో వరద నీరు రావడంతో 9, 11 గేట్ల ద్వారా 3500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటిని దిగువకు వదులుతున్నామ వారు తెలిపారు. దిగువ ప్రాంతంలో ఉన్న మంజీర పరివాహక ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు, గొర్రెల, పశువుల కాపరులు మంజీర తీరం వైపు వెళ్లవద్దని వారు సూచించారు వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఇంకో రెండు గేట్ల ను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కావున మంజీర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ప్రాజెక్ట్ను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి భారీ మొత్తంలో పర్యాటకులు వస్తున్నారని వారన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రాజెక్టులోకి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. కావున ప్రాజెక్టు చూసేందుకు వచ్చిన పర్యాటకులకు ప్రాజెక్టు పైకెక్కె అవకాశం లేదన్నారు. కావున, వీటిని దృష్టిలో పెట్టుకొని పర్యాటకులు ప్రాజెక్టు పైకి ఎక్కకుండా కింది నుంచి చూసి వెళ్లాలన్నారు. ఒకవేళ ఎవరైనా సెల్ఫీలు కనుక దిగితే వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.