Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేర్యాల
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వేతిరేక విధానాలను వెంటనే నిలిపి వేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీక రణను ఆపాలి. కనీస వేతనాలను అమలు చేయాలి' అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అ్యక్షుడు కొంగరి మావో డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యం లో మంగళవారం స్థానిక తహసి ల్దార్ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనం తరం తహసీల్దార్ ఎస్కే ఆరిఫా కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భం గా వెంక ట మావో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రోజురోజుకు నిత్యావసర వస్తు వుల ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపు తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు, రైతులకు మద్దతు ధర, రుణమాఫీ, భూ సమస్యలు పరిష్కరించడం లేదని మండి పడ్డారు. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనా లు చెల్లించడం లేదన్నారు. అర్హులైన పేదలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా కాలయా పన చేస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పేదలు తమ హక్కులను కోల్పోతున్నారని ప్రజల కనీస అవసరాలను తీర్చే విధంగా అందరికీ విద్య, వైద్యం, భూమి, ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, ఉపాధి, భద్రత చే కూర్చే విధంగా ప్రభు త్వాలు చర్యలు చేపట్టా లని డిమాండ్ చేశారు. సీఐటీయూ చేర్యాల పట్టణ కన్వీనర్ రాళ్లబండి భాస్కర్, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గొర్రె శ్రీనివాస్, ఆముదాల నర్సిరెడ్డి, బోయిని మల్లేశం, మేర్గోజు సత్యనారాయణ, గుండ్ర రవీందర్, చాడబోయిన రమేష్, బాలమణి పాల్గొన్నారు.