Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో మంగళవారం ఛలో హైదరాబాద్ పోస్టర్ను సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బి మల్లేష్, జి సాయిలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయని వీటిలో కోటి మంది పైన కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలైనా కనీస వేతనం సవరించలేదన్నారు. కార్మికుల పోరాట ఫలితంగా 2021 జూన్ నెలలో ఐదు జీవోలను విడుదల చేసిందన్నారు. కానీ గెజిట్ చేయలేదని వెంటనే కాలపరిమితి ముగిసిన జీవోను సవరించాలని, ఐదు జీవోలను గెజిట్ చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ సెలవులు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. నేడు చలో హైదరాబాద్ పేరుతో జరిగే మహాధర్నకు జిల్లా నుంచి వందలాది మంది తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాదగిరి, సురేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.