Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
ఫ్రీల్ ఎడ్యుకేషన్ కమిటీ ద్వారా కేసులను పరిష్కరించామని సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఆగష్టు 13వ తేదీన స్థానిక కోర్ట్ కాంప్లెక్స్‌లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను దృష్టి యందుంచుకొని రాజీ మార్గంలో కేసుల సత్వర పరిష్కార ానికై ప్రజల ప్రయోజనార్థం మొత్తంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఒక కమిటీ సీనియర్ కోర్టుకు కేటాయించగా, మూడు కమిటీలను జూనియర్ కోర్టుకు కేటాయించామన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ . సీనియర్ కోర్టుకి సంబంధించిన కమిటీలో కమిటీ మెంబర్లుగా న్యాయవాదులు దత్తాత్రేయ రెడ్డి, పాండురంగా రెడ్డి ఉన్నారని తెలిపారు. అలాగే జూని యర్ కోర్టుకు సంబంధించిన మొదటి కమిటీలో న్యాయ వాదులు గోపాల్, సందీప్ కుమార్, సోమశేఖర్, రెండవ కమిటీలో న్యాయవాదులు సయ్యద్ అహ్మద్, సంతోష్ సాగర్, మహాదేవ్, మూడవ కమిటీలో న్యాయవాదులు శ్రీనివాస్ కన్నా , శంకర్, మానెన్న ఉన్నారని తెలిపారు. లోక్ అదాలత్‌లో రాజిమార్గం ద్వారా కేసులు సత్వర పరిష్కారం చేసుకొదలచిన వారు స్థానిక మండల లీగల్ సర్వీసెస్ కమిటీని సంప్రదించాలన్నారు. లేదా పై కమిటీ సభ్యులలో ఎవరినైనా సంప్రదించి కేసు సత్వర పరిష్కారం చేయడానికి వీలు పడుతుందని తెలిపారు. ఇదివరకు రెండు సివిల్ కేసు లను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించామని తెలిపారు. అందు లో ఓఎస్ 50/2015 కేసులో న్యాయవాదులు అశోక్ పాటిల్, గోపాల్ కౌన్సెలింగ్ నిర్వహించి పరిష్కరించారు. ఓఎస్ 124/2022 కేసులో న్యాయవాదులు శ్రీనివాస్ కన్నా, గోపాల కృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించి రూ.10 లక్షలకు రాజీ కుదిర్చినట్టు తెలిపారు. రాజీయే రాజమార్గంగా అందరూ ముందుకు సాగి కేసులు సత్వర పరిష్కారం చేసుకొని విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకొని అందరూ స్నేహపూర్వకంగా, ప్రశాంత వాతావరణంలో ఉండాలని బాధితులకు, కక్షిదారులకు సూచించారు. అలాగే బాధితులు, కక్షిదారులు అందరూ రాజీ కొరకై ప్రీ-లిటిగేషన్ కమిటీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.