Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్
- కేతకిలో ప్రత్యేక పూజలు
- పలు ప్రజా సంఘాల నాయకులు పాదయాత్రకు సంఘీభావం
నవతెలంగాణ-ఝరాసంగం
నియోజకవర్గంలో ప్రజలను కలిసి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జయహౌ జహీరాబాద్ పేరుతో పాదయాత్ర చేస్తున్నట్లు సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు మేధపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర ఆలయం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని వార్డులలో పర్యటించి సమస్యలను తెలుసుక ున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంత అభివృద్ది తన సంకల్పమన్నారు. గత 20 సంవత్సరాలుగా నిర్వహించిన తెలంగాణ ఉద్యమంతో పాటు అన్ని రకాల ఉద్యమాలలో పాల్గొన్నానని వివరించారు. రాష్ట్రంలోని చెరుకు రైతులతో పాటు రైతు సమస్యలను వివరించేందుకు అప్పటి ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఢిల్లీకి వెళ్లి యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో చర్చించి, సమస్యల పరిష్కారం కొరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ70 వేల కోట్ల రుణ మాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ఉద్యమానికి మొదటగా ఝరాసంగం సంఘం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో చెరుకు రైతు ఆత్మహత్య చేసుకోవడంతో తాను చెరుకు రైతుల తరఫున ఢిల్లీ వరకు పాదయాత్రను కొనసాగించానని గుర్తు చేశారు. అదేవిధంగా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. జహీరా బాద్ ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఒక ఐటిఐ కళాశాల లేకుండా పోయిందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటవుతున్న నిమ్జ్‌లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన లబ్ధి చేకూర్చాలన్నారు. అవసరమైతే మంత్ర ులతో సైతం చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరిన రైతులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జహీరాబాద్ శాసనసభ్యుడిగా తనకు అవకా శం కల్పించాలని ప్రజలతో కోరుతున్నానని ఆయన వివరి ంచారు. జహీరాబాద్ ప్రాంతం వివిధ సంస్కృతి, సమ్మేళ నంతో కూడుకొని ఉందని, అందుకే దీనిని కల్చరల్ క్యాపిట ల్గా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రపంచ స్థాయిలో జహీరాబాద్ కీర్తిని ఇనుమడింపజేస్తామన్నారు. రైతు బిడ్డగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తనకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిక్కీ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంఛార్జి జనార్ధన్, పాదయాత్ర బృందం సభ్యులు స్టీవెన్, శ్రీనివాస్, అరవింద్, శ్రీధర్, మైనార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రకు పలు ప్రజా సంఘాలు సంఘీభావం
రైతు నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ కొనసాగిస్తున్న పాదయాత్రలో భాగంగా మంగ ళవారం గత తొమ్మిది రోజులుగా దీక్షలో కూర్చున్న వీఆర్వోల దీక్షకు ఆయన మద్దతు తెలిపి వీఆర్వోలకు అండగా నిలు స్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వారి సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. ఆయన పాదయాత్రకు మండ ల కేంద్ర ంలో రజక సంఘం, బేడ బుడగ జంగం సంఘం, మానవ హక్కుల సంఘంనాయకులు సంఘీభావం తెలిపారు.