Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అద్యక్షుడు ప్రభాకర్
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో గత నాలుగేం డ్లుగా పెన్షన్ల కోసం అర్హులైనవారు దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తున్నారని, అర్హులైనవారందరికీ పెన్షన్లు అందించాల్సిందేనని బీఎస్పీ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేద్రంలోని పంచాయతీ కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు అర్హులైన పెన్షన్దారులతో పెన్షన్ పోరుబాటలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆర్హులైనవారికి ప్రభుత్వం త్వరితగతిన పెన్షన్లను అందించేలా ప్రత్యేక చదరవచూపాలని ఎంపీడీఓ రాముకు బీఎస్పీ నాయకులు వినతిపత్రమందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణం, మన ఊరు-మన బడి, దళిత బంధు పథకాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని, వయస్సు పైబడి ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందించడంలో మొండివైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి హామీలిచ్చి అమలు చేయడంలో మాత్రం జాప్యం చేయడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న ఆర్హులందరికి పెన్షన్లు అందించాలని బీఎస్పీ పార్టీ పక్షాన ప్రభుత్వానికి సూచిం చారు.ఈ మండల కన్వీనర్లు శ్రీనివాస్,శేఖర్, నాయకులు తిరుపతి,సురేశ్,వేమన, రామచంద్రం,అయా గ్రామాల పెన్షన్ దరఖాస్తుదారులు పాల్గొన్నారు.