Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపెండిక్స్తో వస్తే తిరిగి పంపిన డాక్టర్లు
- ప్రైవేట్ ఆసుత్రులలో కార్మికుల జేబులు ఖాళీ
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి
నవతెలంగాణ-రామచంద్రాపురం
ఈఎస్ఐ అధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యంతో కార్మికులు ప్రవేట్ హాస్పిటల్ ను ఆశ్రయించాల్సి వస్తుందని సిఐటియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి అన్నారు. సదాశివపేట కు చెందిన జి సుభాష్ అనే కార్మికుడు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతని ఎనిమిది సంవత్సరాల కుమారునికి అపెండిక్స్ వచ్చి తీవ్ర కడుపు నొప్పితో ఉన్న సమయంలో ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి సార్ మా బాబుకు ఇలా ఉన్నది మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా, ఆపరే షన్ చేస్తారా అని అడిగితే వెంటనే పంపించండి ఇక్కడ ఆపరేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కార్మికుడు వెంటనే కిరాయి వాహనంలో ఈఎస్ఐ రామచంద్రపురం ఆసుపత్రికి తీసుకు వచ్చిన తర్వాత డాక్టర్లు ఇప్పుడు ఆపరేషన్ చేయం, రేపు చేస్తాం లేదంటే తీసుకెళ్లండని చెప్పి దురుసుగా సమాధానమిచ్చారు. ఈ విషయం సూపరింట ెండెంట్ తెలియజేసిన వెంటనే వెళ్లి మాట్లాడుతానన్నారు . కానీ మాట్లాడలేదు. బాబు కడుపునొప్పి భరించలేక పోవడ ంతో బాలుడి తండ్రి తన కొడుకు బాధ చూడలేక తిరిగి సంగారెడ్డి లోని చరిత ప్రైవేట్ హాస్పిటల్‌కు తిరిగి తీసుకెళ్లి జాయిన్ చేశాడు. తన స్నేహితుల దగ్గర అప్పుచేసి అక్కడ వెంటనే ఆపరేషన్ చేయించారు. ఈఎస్ఐ హాస్పిటల్ కార్మికుల కోసం ఉంది కదా, మా డబ్బులతో హాస్పిటల్ నడుస్తుంది కదా, అని ఆ కార్మికుడు అంత దూరం నుంచి తీసుకొస్తే కాదు పొమ్మని వెనక్కి పంపించడమంటే హాస్పిటల్లో ఉన్న అధికారులు, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన హాస్పిటల్ దేనికోసమని నరసింహారెడ్డి ప్రశ్నించారు. ఈఎస్ఐ హాస్పిటల్ అంటే అందులో ఖర్చుపెట్టే ప్రతి పైసా కార్మికులదని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇలాంటివి నిత్యం జరుగుతున్నాయని, ఇంకా అనేకం తమ దృష్టిలో ఉన్నాయని, ఈ విషయంపై ఈఎస్ఐ కార్పొరేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.