Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
పాఠశాలల్లో ప్రణాళికాబద్ధంగా బోధించి విద్యార్థులకు కనీస సామర్ధ్యాలు సాధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోర్స్ డైరెక్టర్, మండల విద్యాధికారి తగిరెడ్డి దేశి రెడ్డి సూచించారు. మంగళవారం నంగునూరు మండ లంలోని పాలమాకుల ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు శిక్షణ(ఎఫ్ఎల్ఎన్) ముగింపు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కోర్స్ ఇంచార్జ్ ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించి ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు అడిగిన సందేహాలను రిసోర్స్ పర్సనల్ దయానందరాజు, వెంకటేశ్వర్లు, కుమార్, ఎల్లం,సంజీవులు నివతి గావించారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు శనిగరం కనకయ్య తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయులు కష్ణ, హరి, అనంతలక్ష్మి, నీరజ, రాజిరెడ్డి,సుధాకర్ రెడ్డి, రామకష్ణ, జయపాల్ యాదవ్, వీరారెడ్డి, భూపాల్ రెడ్డి, శ్రీకాంత్, మోహన్, సురేఖ, విజయ రాణి తదితరులు పాల్గొన్నారు.