Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీ.వోలను సవరించాలని.. విడుదల చేసిన జీ.వోలను గెజిట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ మంగళవారం పటాన్చెరులో కరపత్రం విడుదల చేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతీ ఐదేండ్లకొ కసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వేతనాలు సవరించాలని.. కానీ ఎనిమిదేండ్లు గడిచిన కార్మికుల వేతనాలు సవరించడం లేదన్నారు. దీంతో చాలీ చాలని వేత నాలతో కార్మికులు తమ జీవితాలను పోషించు కుంటున్నరని అన్నారు. పఠాన్‌చెరు, పాశంమైలారం, బొల్లారం, ఖాజిపల్లీ, బొంతపల్లీ పారిశ్రామిక ప్రాంతాల్లో అనేక పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కార్మిక నివాస ప్రాంతాల్లో కనీస సౌ కార్యాలు కరువయ్యాయన్నారు.ఈ పరిష్కారం కోసం నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శంకర్, కష్ణ, లింగం, నందు, లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.