Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత
నవ తెలంగాణ-సిద్దిపేట అర్బన్
ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సీపీ. ఎన్. శ్వేత పోలిస్ అధికారు లకు సూచించారు. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సూచన మేరకు మంగళవారం సీపీ ఆఫీస్లో ఆమె పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్వ ర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు ఎస్ఐ ప్రిలిమి నరీ రాత పరీక్షకు చేయాల్సిన పకడ్బందీ ఏర్పాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాలలో 4,544 మంది ఎస్సై అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకారున్నారని తెలి పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహందీ వంటివి పెట్టుకు రావొద్దని సూచించారు. రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో-ఆర్డినేటర్ ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజు, నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. ఎలాంటి సందేహాలున్నా వారి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. అడిషనల్ డీసీపీలు రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు ఫణిందర్, రమేష్, సతీష్, చీప్ సూపర్ండెంట్లు, ఇన్స్పెక్టర్లు భాను ప్రకాష్, రవికుమార్, బిక్షపతి, జానకి రామ్ రెడ్డి పాల్గొన్నారు.