Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చేర్యాల
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలకు చెందిన వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు ప్రతాప్‌రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగ రావు, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కాటం మల్లేశం,ఎండి ఖాజా, ఒగ్గు మల్లేశం, బుట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
హవేలీ ఘనపూర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్య దర్శి కే మల్లేశం అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యా లయం ముందు వీఆర్ ఏలు రోడ్డును శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనం తరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్షలో కూ ర్చున్నారు. వీఆర్ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తలారి సంజీవులు, నాయకులు రామచందర్, లక్ష్మయ్య, సంతోష్, గోపాల్, అరవింద్, ప్రభు చరణ్, వీఆర్ఏలు పాల్గొన్నారు.
అక్కన్నపేట : వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ అక్కన్నపేట మండలంలో గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏల సమ్మెకు సీపీఐ నాయకులు మంగళవారం సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి యెడల వనేశ్, కొమ్ముల భాస్కర్, జేరిపోతుల జనార్ధన్,మంద శ్రీను,కిన్నెర కొమురయ్య, మాచర్ల శ్రీనులు ఉన్నారు.
నంగునూరు : రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు నంగునూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పంగ మల్లేశం, ఉపాధ్యక్షులు నలుమాల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి శ్రీరాముల మల్లేశం . కోశాధికారి గౌరబోయిన యాదగిరి, కార్యదర్శి పిల్లి నరేష్, కార్యవర్గ సభ్యులు సొప్పరి ప్రశాంత్ కుమార్, గౌరబోయిన శ్యామల, అజరు, అబ్బయ్య, మండలానికి చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.
బెజ్జంకి : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకిచ్చిన పేస్కేల్ హామీని చిత్తశుద్ధితో నెరవేర్చాలని బీఎస్పీ మానకోండూర్ నియోజకవర్గ అద్యక్షుడు బోనగిరి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ వద్ద 9వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెకు బీఎస్పీ పార్టీ నాయకులు సమ్మె శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. బీఎస్పీ మండల కన్వీనర్లు శ్రీనివాస్, శేఖర్, నాయకులు తిరుపతి, సురేశ్, వేమన, రామచంద్రం తదితరులు హాజరయ్యారు.
మిరుదొడ్డి : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మెరుగుదొడ్డి మండల కేంద్రంలో 9వ రోజు మంగళవారం వీఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా వీఆర్ఏలు చారు పెట్టి మండల కేంద్రానికి వచ్చిన ప్రజలకు చారు అందించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏలు నాగరాజు, మైసయ్య, కల్పన పలువురు పాల్గొన్నారు.
చేగుంట : తెలంగాణ రాష్ట్రానికి తమవంతు కృషి చేసిన వీఆర్ఏలు గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర మొత్తం నిరవధిక దీక్ష చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యం ఎదుట టెంట్ వేసుకుని దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు మద్దతుగా మంగళవారం బైఠాయించి వారి దీక్షకు సంఘీ భావం తెలిపారు. వీఆర్ఏల సంఘం మండల శాఖ అధ్యక్షు డు యాదగిరి, ప్రధాన కార్యదర్శి షాదుల్లా, జిల్లా జేఏసీ కన్వీనర్ కుమ్మరి నాగరాజు, వీఆర్ఏలు మమత, స్వప్న, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెంటారెడ్డి, స్టాలిన్ నర్సింలు, కొండి శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
గజ్వేల్ : వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ శాఖలో పని చేస్తున్న రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు మంగళవారం సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జేఎస్సీ నాయకులు హరిబాబు, రవితేజ, రఘువరన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ములుగు : వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. మంగళవారం నాటికి మండలంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. వీఆర్ఏ అధ్యక్షుడు నీరుడి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు చింతకాయల నాగేష్ ప్రధాన కార్యదర్శి రాధిక కార్యదర్శి రాస మల్ల నవీన్ బిక్షపతి ముత్యాలు రాములు కుమార్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
తొగుట : వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పరి ష్కరించాలని కోరారు. మంగళవారం నాటికి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులకు, ప్రజలకు టీ ఇచ్చి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వీఅర్ఎల మండల అధ్యక్షుడు టంకరి నర్సింలు, ప్రధాన కార్యదర్శి మల్లేశం, కనకయ్య, కాళ్లస్వామి పాల్గొన్నారు.