Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అక్కన్నపేట
గుడాటిపల్లి భూనిర్వాసితుల న్యాయమైన పరిహారం చెల్లించకుండా మొండి వైఖరితో హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రాజెక్టు విషయమై అక్రమ కేసులు పెట్టి జైలు కెళ్లి విడుదలైన నిర్వాసితులను పరామర్శించారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ నిర్వాసితులు భూములు ఇచ్చింది జైలుకెళ్లడం కోసమేనా అని ప్రశ్నించారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే మొండి వైఖరితో వ్యవహరించిందన్నారు. అరెస్టయినవారిలో బద్దం శంకర్‌రెడ్డి, అంగెటి తిరుపతిరెడ్డి, నల్ల మహేందర్, రాగి శ్రీనివాస్, భూక్య సక్రులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు నిర్వాసితుల పక్షాన పోరాడుతుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో గుడాటిపల్లి సర్పంచ్ రాజిరెడ్డి, అక్కన్నపేట్ మండల అధ్యక్షుడు జంగపేల్లి ఐలయ్య, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందు, కాంగ్రేస్ నాయకులు చిత్తరి రవి, అక్కన్నపేట్ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ భూపతి ముకుందరెడ్డి, మాజీ ఎంపిటిసి భాస్కర్ నాయక్, మాజీ ఎంపిటిసి బైరగోని శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు చింతల బాలరాజు, కిసాన్ సెల్ అధ్యక్షుడు పొడిశెట్టి, సుగుర్తి బాలరాజు, ఎడబోయిన మహేందర్ రెడ్డి, కర్ర రవీందర్, కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, పత్తిపాక త్రిమూర్తి, భూపతి లింగారెడ్డి, రెడ్డి, రెడ్డి యాదగిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు పాండ్రాల దామోదర్, నకీర్తి మునిరాజ్, అక్కన్నపేట యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు దేవునూరి రాజు, సాగర్, విశ్వతేజ, రమేష్ నాయక్, భూనిర్వాసితులు బొజ్జ పూరి రాజు, మామిడి శ్రీకాంత్, కలువల సంపత్, బైరి శ్రీను, బుడిగే సుధాకర్, అన్నాడి మల్లారెడ్డి, పిట్టల అజరు కుమార్, తదితరులు పాల్గొన్నారు.