Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి
- సామాజిక చైతన్య సభలలో కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ-కంది
అమరుల స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల శ్రేయస్సు కోసం ఉద్యమించాలని కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు అమరుల యాదిలోసర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో సామాజిక చైతన్య సభలు నిర్వహించను న్నాు. ఈ మేరకు మంగళవారం మండలంలోని చెర్లగూడెం గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమా లలు వేసి నివాళ్లర్పించారు. సర్పంచ్ టిసిఎస్ అధ్యక్షులు సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సుకోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమ కోసం పనిచేసి అమరులైన త్యాగ మూర్తులను స్మరించుకుంటూ సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 18 వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్య యాత్రలు చేసి సభలు, సమావేశాలు నిర్వహిసా ్తమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత ్సవాలను ఆగస్టు 18న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జయంతి సభను జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో నిర్వహిసా ్తమన్నారు.కల్లుగీత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కషి చేస్తామన్నారు. కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మబిక్షం, బైరు మల్లయ్య లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు. జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ,పెరియార్ రామస్వామి అంబేద్కర్ లాంటి సామాజిక నాయకులు, సంఘసంస్కర్తల జీవిత విశేషాలను వారి సేవలను ఈ తరానికి అందిస్తామ న్నారు. కల్లుగీత కార్మికుల సమ స్యలు పరిష్కరించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధం గా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసా రు. ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఉపాధ్యక్షులు జంగన్న గౌడ్ గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.