Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-గజ్వేల్
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ ఉద్యోగులందరికీ మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లా యిస్ యూనియన్ సిద్దిపేట జిల్లా మూడో మహాసభలు గజ్వేల్ పట్టణంలో మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో జరి గాయి. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా భూపాల్ గారు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం కోసం నూతన విద్యుత్ సవరణ చ ట్టాన్ని పార్లమెంట్లో పెట్టిందన్నారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతనవిద్యుత్ సవరణచట్టంతో ఉద్యోగుల ఉపాధి భద్రత సమస్యతో పాటు సాధారణ ప్రజలపై భారం పడుతుందన్నారు. దేశంలో బొగ్గు నిలువలు అత్యధికంగా ఉన్న అదానీకోసం కత్రిమ కొరత సష్టించి విదేశీ బొగ్గును కొనేలా విద్యుత్తు ట్రాన్స్మిషన్లపై ఒత్తిడి చేసిందని ఆయన చెప్పారు. విద్యుత్ ఉద్యోగులందరికీ మెరుగైన పిఆర్సి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న గహ అవసరాలు ఖర్చులు నాణ్యమైన సౌకర్యాలు పొందేలా విద్యుత్ యజమా న్యం చర్యలు తీసుకోవాలని పిఆర్సి అందించాలని అన్నారు. సంవత్సరాల తరబడి ఆర్టిజన్లుగా ఉన్న కార్మికులను జేఎల్ఎం గా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ లో ఉన్న 73 జీవోలను సవరణ చేయాలని కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న పీస్ వర్క్, డైలీ వేజ్, మీటర్ రీడర్స్, మెయింటెనెన్స్ వివిధ రూపాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు చట్టపరమైన సౌకర్యాలు ఈ ఎస్ ఐ, పి ఎఫ్, గుర్తింపు కార్డులు అమలు చేయాలని కోరారు. మహాసభల ముందుగా ఆంధ్ర బ్యాంకు నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా శోభ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది డివిజన్ ఆఫీస్ వద్ద యూనియన్ జెండాను అధ్యక్షులు పరశురాములు ఆవిష్కరించారు. మహాసభ సందర్భంగా యూనియన్ జెండాను మహాసభ కిరణ్ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షుడు కాటం మధు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుమారస్వామి , గోవర్ధన్ , రాష్ట్ర వర్కింగ్ ప్రజెంట్ స్వామి, కంపెనీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర ప్రసాద్,సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లయ్య గోపాలస్వామి, జిల్లా సహా కార్యదర్శి బండ్ల స్వామి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు చంద్రారెడ్డి, సధాకర్ ,నరసింహచారి, అశోక్ , పరశురాములు రవికుమార్ యాదగిరి బండ్ల శ్రీను పాల్గొన్నారు.