Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రికి రాత్రే హెల్త్ క్యాంపు ఏర్పాటు
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన కాళ్లకల్‌లో సోమవారం సాయంత్రం నుంచి వాంతులు విరోచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో ఒక్కసారిగా ప్రజలు అస్వస్థతకు గురికావడంతో భయాందోళనకు గురయ్యారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి రాత్రికి రాత్రే హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయించారు. ఎంపీపీ పురం నవనీత రవిముదిరాజ్ సర్పంచ్ నత్తి మల్లేష్ముదిరాజ్, ఎంపీటీసి నత్తి లావణ్య, కార్యదర్శి శామ్యూల్‌రెడ్డి దగ్గరుండీ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ ఆనంద్ ఆద్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల వాటర్ ఫిల్టర్ నీటిని తాగడంతో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. మిషన్ భగీరథ నీటిదా లేక మినరల్ వాటర్ ఫిల్టర్ నీటితో జరిగిందా అని తెలుసుకుంటున్నారు. గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గల మినరల్ వాటర్ ప్లాంట్‌లో వాటర్ ఫిల్టర్ గత వారం రోజుల క్రితం పాడైనట్టు గ్రామస్తులు తెలిపారు. ఫిల్టర్ నుంచి నీటిని తాగిన వారే చాలా వరకు అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు వైద్య శిబిరాన్ని సందర్శించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావ్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని పారిశుధ్యంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరం ఇంకా మూడు రోజుల పాటు కొనసాగుతుందని, ప్రజలెవరూ భయాందోళన చెందొద్దని సూచించారు. కలుషిత ఆహార పదార్థాలు తినడం మూలంగానా లేదా నీటి వల్లనా అనే దానిపై వాచారణ చేస్తున్నాట్టు తెలిపారు. గ్రామంలో ఒకరు అనారోగ్యంతో మృతి చెందారని వారిని పోస్టు మార్టం చేయిస్తున్నట్టు తెలిపారు. అలాగే వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికి వెల్లి వారి ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకుని వాటిపై ఒక కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. దాంతో గ్రామంలో ఇంకా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిపారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వస్తాయని కలుషిత ఆహారం కాని కలుషిత నీటి వల్ల కాని వచే అవకాశం ఉంటుందని ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాచి వడపోసిన నీటిని తాగాలని తెలిపారు. వైద్య శిభిరంలో సుమారు 36 మందికి వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు పురం మహేశ్వఱ్ముదిరాజ్ గ్రామంలో పీహెచ్సిని ఏర్పాటు చేయాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావ్ను కోరారు. గ్రామంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితలతో గ్రామ పాలక వర్గం సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆద్వర్యంలో గ్రామంలో పారిశుద్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని వీధులలో బ్లీచింగ్ చల్లడంతో పాటు మురుగుకాల్వల వద్ద పేరుకున్న చెత్తను శుభ్రం చేస్తున్నారు. ఎక్కడ కూడా నీరు నిలువ ఉన్నా అక్కడ శుబ్రంచేస్తున్నారు. గ్రామ ఉపసర్పంచ్ తుమ్మల రాజుయాదవ్‌తో పాటు పాలక వర్గ సభ్యులు బాదితులకు సహకారాలను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా పంచాయితీ అధికారి గ్రామంలో నెల కొన్న అపరిశుభ్రతపై కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో పారిశుద్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి గంటకు ఒకసారి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను తెలియజేయాలని డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీవో లక్ష్మినర్సింలులను ఆదేశించారు.