Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-కొండపాక
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సమీకత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలను సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ అర్జీల పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దష్టి సారించి సత్వరమే అన్నింటికి పరిష్కరించాలని అన్నారు. అర్జీదారుడు మళ్లీ తిరిగి అర్జీ పెట్టుకోకుండా పరిష్కారం చూపాలని అధికారులకు తెలియజేశారు. భూ సంబంధిత సమస్యలు, రెండు పడక గదుల ఇల్లు, ఆసరా పెన్షన్లు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 63 వినతులు వచ్చాయి. ఇట్టి కార్యక్రమంలో డిఆర్ఓ చెన్నయ్య, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.