Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
బీజేపీలో డిష్యూం...డిష్యూం జరుగుతోంది. ఇద్దరు నేతల మధ్య నెలకొన్ని ఆధిపత్య పోరు కాస్త వీధి కొట్లాట వరకు వచ్చింది. వరుసగా రెండు రోజుల పాటు రెండు గ్రూపుల కార్యకర్తలు కొట్టాడుకోవడం జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేపట్టిన సంగ్రాహాయాత్ర జోరుగా సాగుతుండగా జిల్లాల్లో నియోజకవర్గాలల్లో ప్రజా గోస...బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివపేట పట్టణంలో బైక్ ర్యాలీ జరిగింది. ఆది, సోమవారాల్లో జరిగిన ర్యాలీ సందర్భంగా రెండు గ్రూపులకు చెందిన కార్యకర్తలు గొడవపడి కొట్టుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీ రాజేశ్వర్రావుదేశ్పాండేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ర్యాలీ సందర్భంగా సదాశివపేట పట్టణంలో జెండా ఆవిష్కరణ విషయంలో దేశపాండేకు నరేందర్‌రెడ్డి గ్రూపుకు చెందిన వేణుమాధవ్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు గ్రూపుల కార్యకర్తలు తోపులాడుకున్నారు. బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు అల్జీపూర్ శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్ర నాయకుడి ఎదుటనే ఇరు గ్రూపులకు చెందిన కార్యకర్తలు, నాయకులు కొట్లాడుకోవడం, తోపులాడుకోవడం, తిట్టుకోవడం చూసి అసహనానికి గురయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న నాయకులు గ్రూపు పంచాయతీ గురంచి రాష్ట్ర పార్టీకి నివేదించే అవకాశముంది. రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు పోటీపడుతున్నారు. అదే క్రమంలో బైక్ ర్యాలీలో గొడవకు దారి తీసింది. మొదటి రోజు కూడా రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు హాజరయ్యారు. ఆయన సమక్షంలో కూడా రెండు గ్రూపులు గొడవకు దిగాయి.