Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
రెండు రోజలుగా ఎడతెరిపిలేని వర్షాలకు తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో పలు గ్రామాల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. పలు గ్రామాల్లొని చెరువులు మత్తడి దూకుతున్నాయి. తూప్రాన్ పెద్ద చెరువు గత పది సంవత్సరాలలొ ఈ వర్షాలకు నిండుకుని మత్తడి దూకుతుంది. గత 35 సంవత్సరాలుగా నిండని మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి చెరువు అలుగు దూకింది. రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు దండుపల్లి మద్దుల చెరువు అలుగు దూకడంతో గ్రామంలోని ప్రజలు ఆనందర వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు పంజా భిక్షపతి, ఉపసర్పంచ్ మహెందర్గౌడ్ల ఆద్వర్యంలో గ్రామ పురోహితుడు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ జ్రలను రైతులను చల్లంగా చూడాలని నాయకులు కోరారు. ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.