Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
మండల కేంద్రమైన జిన్నారంలోని వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డును వేలం పాటలో రూ.51 వేలకు జిన్నారం అంతిరె డ్డిగారి కరుణాకర్ రెడ్డి దక్కించుకున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నేత జిన్నారం ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు జిన్నారం వెంకటేష్ గౌడ్, సర్పంచ్ నీలం సంజీవ ఈ మేరకు వివేకానంద యువజన సంఘం వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వివేకానంద యువజన సంఘం సభ్యులు వేలంపాటలో దక్కించుకున్న లడ్డూను అంతిరెడ్డిగారి కరుణా కర్ రెడ్డి కుమారుడు అంతరెడ్డిగారి మనీష్రెడ్డికి అందజే శారు. ఈ సందర్భంగా వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ యువకుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం పెరగాలన్నారు. కరుణాకర్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకా ంక్షించారు. గ్రామపంచాయతీకి చెందిన పలువురు వార్డు సభ్యులు వివేకనందా యువజన సంఘం ప్రతినిధులు నాయకులు కోరబోయిన నరేష్, బ్రహ్మేంద్ర గౌడ్, గొల్ల శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్ రావు, నీల మోహన్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.