Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోదండరెడ్డి
నవతెలంగాణ-సంగారెడ్డి
పట్టిష్టమైన రెవెన్యూ వ్యవస్థను దెబ్బతీసి ధరణీ పేర వేల ఎకరాల భూముల్ని మాయం చేసేందుకు సీఎం కేసీఆర్ నేరానికి పాల్పడ్డాడని ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. సోమవారం ఆయన జహీ రాబాద్ రైతులతో కలిసి ప్రజావాణిలో కలెక్టర్ ఎ.శరత్‌కు భూముల సమస్యలపై ఆధారాలతో కూడి ఫైల్‌ను అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడా రు. నిజాం కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చాడన్నారు. తెలంగాణ వచ్చాక 2018లో ప్రతి భూమిని సర్వే చేసి పట్టాదారులకు కొత్త పాసుపుస్తకాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇన్నాళైనా ఎక్కడ సర్వే చేయలేదన్నారు. యూపీఎ ప్రభుత్వం భూముల సర్వే కోసం రూ.80 కోట్లు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయలేదన్నారు. ధరణి వెబ్సైట్ నిర్వాహణను పి లిప్సిన్కు చెందిన ఓ దివాళా తీసిన కంపెనీకి అప్పజెప్పడం కేసీఆర్ దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు. ధరణి తేవడం వెనకాల లక్షల ఎకరాల భూముల్ని కాజేసే కుట్ర జరుగు తుందన్నారు. సీఎంకు కావాల్సిన వ్యక్తులకు వ ందల ఎకరా ల్ని కట్టబెడుతూ ధరణిలో చేర్చుతున్నారన్నారు. అదే పట్టా దారులైన పేదల భూముల్ని మాత్రం వక్ఫ్, అసైన్డ్ అనే నెపంతో పెండింగ్‌లో పెట్టారన్నారు. జహీరాబాద్‌లో ప్రాం తంలోనే వెయ్యి ఎకరాల వరకు పట్టాభూముల్ని వక్ఫ్ గెజి ట్లో నమోదు చేయడం వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బం దులు పడుతున్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పట్టాలు న్నాయన్నారు. డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మలజగ్గారెగ్డి, నాయకులు జూలకంటి ఆంజనేయులు, జార్జ్, కస్మీ రాజు, కూన సంతోష్, చంద్రారెడ్డి, విజయకుమార్, బుచ్చిరాములు, తహేర్పాషా తదితరులున్నారు.