Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ రేపు(బుధవారం) భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆధ్వర్యంలో సంగారెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహి స్తున్నామని.. ఈ సభకు ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి ప్రకాష్ రావు హాజరవుతారుని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. భూమికోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా సాగిన బహత్త ర పోరా టానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులన్నారు. సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధంలేని బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాట నిజమైన వారసులు కమ్యూనిస్టులే నన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ రైతాంగపోరాట వార్షికోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని సభలు సమావేశాన్ని సంగా రెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో జరపాలని పిలుపు నిచ్చారు. అందులో భాగంగా సంగారెడ్డి పట్టణంలో సీపీఐ జిల్లా కార్యాలయంలో రేపు సభ నిర్వహిస్తున్నామని.. ఈ సభకు పార్టీ జిల్లా నాయకత్వం పార్టీ సభ్యులు, సానుభూ తిపరులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.