Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
పోరాట ఫలితంగానే ఎస్సై, కానిస్టేబుల్ అర్హత మార్కుల కటాఫ్ తగ్గిస్తామని సీఎం ప్రకటించారని కేవీప ీఎస్ ఉపాధ్యక్షులు అతిమెల మానిక్యం అన్నారు. సంగారె డ్డిలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. కటాఫ్ తగ్గిస్తామని అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకట నను స్వాగతిస్తున్నామని.. కానీ ఎంతకు కటాఫ్ తగ్గించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ, బీసీ ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల్లో అభ్యర్థులకు రిజర్వేషన్ ప్రకారం ప్రత్యేక రాయితితో మార్కులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఓసిలకు మాత్రమే కటాఫ్ ప్రకటించి ఎస్సి, ఎస్టీ, బిసి అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు. దీనిపై గత 10 రోజులుగా సాగిన పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి కటాఫ్ తగ్గిస్తామని ప్రకటించారన్నారు. బోర్డ్‌లో రిజర్వేషన్ మూలాలను దెబ్బతీసే వ్యక్తులను పెట్టొద్దన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య అవుతుందన్నారు. సుమారు 6లక్షల మంది అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు రాయగా.. నెగెటివ్ మార్కులు పెట్టడడంతో 4లక్షల మంది ఈవెంట్స్, మెయిన్స్‌కు రాలేరని చెప్పారు. అభ్యర్థులు న్యాయ పోరాటం ప్రజాస్వామ్య శాంతియుత పోరాటం ఫలించిందన్నారు. నెగెటివ్ మార్కులు రద్దు చేయాలని, తప్పులు దొర్లిన ఎస్ఐ లో 22, కానిస్టేబుల్లో 14 మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్,నాయకులు దత్తు, దాస్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.