Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల అగచాట్లు
- బీఎస్పీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి సింగారం ఓంప్రకాష్
నవతెలంగాణ - పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో నిర్ణీత సమయానికి పాఠాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తక్షణమే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని బీఎస్పీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి సింగారం ఓంప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పటాన్ చెరు డివిజన్ లోని బండ్లగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను బందంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న తరగతుల ఉపాధ్యాయులతో భోధనా తరగతులు జరుగుత ున్నాయని, దీని వల్ల విద్యార్థులకు పాఠ్యంశంపై పూర్తి అవగా హనా లేక అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదం డులు అందించిన సమాచారం మేరకు పాఠశాల వద్దకు చేరుకున్న ఓంప్రకాష్ విద్యార్థులతో మాట్లాడి వారి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. భావితరాల భవిష్యత్తుకి ప్రభుత్వం తీసుకున్న భాద్యత ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారు తెలంగాణా అంటూ ప్రజలను నమ్మించి ఇప్పటి వరకు చేసిన మోసం చాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం సరికాదని వారికి కావలసిన ఉపా ధ్యాయులను వెంటనే సమకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బీఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిద ండ్రులతో కలిసి బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలో రాబోయే బహుజన రాజ్యంలో విద్యకు పెద్ద పీట వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమా జ్ పార్టీ నాయకులు, రుద్రారం గ్రామ ఉపసర్పంచ్ యాద య్య, శంకర్, నర్సింలు, పటాన్చెరు అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ ప్రశాంత్, అమీన్ పూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ కె.రాములు, అమీన్ పూర్ మండల నాయకులు చిన్నగళ్ల గిరిబాబు, అజరు, విజరు, తదితరులు పాల్గొన్నారు.