Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీబీవీ హాస్టల్ ఏర్పాటు చేయాలి
- పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్
నవతెలంగాణ-నిజాంపేట
విద్య హాక్కుచట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి ప్రభుత్వ స్కూల్, కాలేజీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ డిమాండ్ చేశారు. మండలంలోని నస్కల్ ప్రభుత్వ స్కూల్లో మండల కార్యదర్శి నవీన్ చేతుల మీదుగా నాల్గవ మహాసభల వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16 తేదీలలో కరీంనగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. కనీ సం విద్యా అభివద్ధికి ఎలాంటి నిధులు కేటాయిం చకుండా, విద్యార్ధుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 2015లో పెంచిన మెస్, కాస్మోటిక్ ఛార్జీలు మాత్రమే నేటికీ అమలు చేస్తూ రోజుకు ఒక్కో విద్యార్ధికి 36 రుపాయాలు కేటాయింపు చేస్తున్నారని, పెరిగిన ధరలతో ఈ మెస్ ఛార్జీలు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెలకు 100 బాలురకు, 150 బాలికలకు సబ్బులు, షాంపుల కు,హెయిర్ ఆయిల్ కోసం ఇస్తున్న కాస్మోటిక్ చార్జిలు ఎలా సరిపోతాయ న్నారు. ఈ అంశాలను మహాసభలో చర్చించి కార్యచరణ రూపోందిస్తామ న్నారు. అలాగే దేశంలో నూతన విద్యావిధానం-2020 పేరుతో విద్యరంగాన్ని కార్పో రట్ వర్గాలకు అప్పజెప్పి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం ఈ విద్యావిధా నం తీసుకుని వచ్చిందన్నారు. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని, దేశ వ్యాప్తంగా రద్దుకై జరిగే పోరాటానికి అనుబంధంగా రాష్ట్రంలో కార్యచరణ రూపోందిస్తామన్నారు. రాష్ట్రంలో 1483 గురుకులాలు, కేజీబీవీలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని సరైన సౌకర్యాలను కల్పించకపోవడం ఫలితంగా పుడ్ ఫాయిజన్, అనారోగ్య సమస్యలతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలోనే గురుకులాలలో ఎలుకలు కోరకడం, పుడ్ ఫాయిజన్, కరెంటు షాక్ లాంటి సమస్యలుతో 09 మంది విద్యార్ధులు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారని అయినా ప్రభుత్వం ఎక్కడ స్పందించి సహాకారాన్ని అందించలేదని వారు వాపోయారు. పెండింగ్ స్కాలర్ షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. లక్షల రుపాయాలు డోనెషన్లు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకొని, ఫీజునియంత్రణ చేయాలన్నారు. ప్రైవేట్, కార్పోరేట్ ఫీజులు నియంత్రణకై ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలను ప్రధానంగా మహాసభలలో చర్చించి తీర్మాణాలు రూపోందించి భవిష్యత్ పోరాట కార్యచరణ రూపోందిస్తామని వారు తెలిపారు.