Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ జ్యోతి ప్రకాష్ డాష్
నవతెలంగాణ-సిద్దిపేట
నాణేలు భారత దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుపుతాయనీ హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ జ్యోతి ప్రకాష్ డాష్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్రస్థాయి సదస్సులో భాగంగా మొదటి రోజు ప్రారంభ సమావేశం, సాంకే తిక సమావేశాలు నిర్వహించబడ్డాయి. సమావేశాల కు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రకాష్ డాష్ మాట్లాడుతూ దక్కన్ పీఠభూమి సామ్రాజ్యాల చరిత్రను తెలుసుకోవడానికి నాణాలు ఎంతగానో తోడ్పడ్డాయని తెలిపారు. మరో సమావేశంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లావణ్య మాట్లాడుతూ నాణేల వల్ల ఒక దేశం యొక్క భాష, సంస్కతి, చిహ్నాలు, లోహము, విగ్రహము లాంటి ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు. నాణేలు చరిత్ర లిఖించడానికి ఎంతగానో తోడ్పడతాయని సూచిం చారు. కె. వైకుంఠచారి మాట్లాడుతూ నాణేలు దేశ చరిత్రను లిఖించడమే కాకుండా భవిష్యత్ తరాలకు చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదను చాటడానికి సహకరిస్తాయని తెలిపారు. టార్చ్ సభ్యులు అరవింద్ ఆర్య మాట్లాడుతూ నాణేల గురించి అధ్యయనం జరగవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉందని, ఇంకా చరిత్రను వెలికి తీయాల్సిన బాధ్యత యువతపైన ఆధారపడి ఉందని సూచించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ కళాశాలలో చారిత్రక లిఖిత ఆధారాలైన నాణాలను ప్రదర్శింపజేసి, విద్యార్థులకు అవగాహన కల్పించడం విశేషదాయకమని అభినం దించారు. ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె హుస్సేన్, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల సుదర్శనం, అకాడమిక్ సెల్ కన్వీనర్ డాక్టర్ కె భవాని, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ మధుసూదన్, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ టి మల్లేశం, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ పి పల్లవి, సదస్సు సంచాలకులు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, చరిత్ర విభాగం అధ్యాపకులు, విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు.