Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేట మండల వైద్యాధికారిపై ఎంపీపీ, మండల సభ్యులు ఆగ్రహం
నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్
పెద్ద శంకరంపేట మండల వివిధ శాఖల అధికారులు పనితీరు మార్చుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. సోమవారం పేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పేట మండల వైద్యాధికారిపై ఎంపీపీ జగన్ శ్రీనివాస్‌తో పాటు మండల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోగా ఈ సమావేశానికి కూడా రాకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎంపీపీ వెంటనే జిల్లా వైద్యాధికారికి ఫోన్లో ఫిర్యాదు చేసి మండల వైద్యాధికారిని తొలగించి పేట మండలానికి మరోవైద్యాధికారిని నియమించాలన్నారు. కమలాపూర్ చిలపల్లి శివయ్య పల్లి మూసాపేట్, గ్రామాలలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏఈకి ఎంపీపీ సూచించారు. వివిధ శాఖల మండల అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని, వారు చెప్పిన పనులను పరిష్కరించడం లేదని. ఈ పద్ధతిని మార్చుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మండల సర్వసభ్య సమావేశాన్ని రద్దు చేయడం జరుగుతుందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాలలో ప్రజాప్రతినిధులు అధికారులు పరస్పరం సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, ఎంపీడీవో రియాజుద్దీన్, నీటిపారుదల శాఖ డీఈ రోహిని, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.