Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసిన చిట్కుల్ సర్పంచ్
- బాగా పనిచేస్తున్నావని ప్రశంసలు
నవతెలంగాణ-పటాన్చెరు
'శబాష్ నీలం మధు.. గో అహెడ్' అంటూ టీిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజును రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. మంగళవారం మధు తన సన్నిహితులతో కలిసి అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆ సందర్భంగా పూల బొకే అందించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో ఈ నెల 26న ఏర్పాటు చేయనున్న ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్ర మానికి మంత్రి కేటీఆర్‌ను నీలం మధు ఆహ్వనించారు. తప్పకుండ విగ్రహ ఆవిష్కరణకు హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గ్రామాభివద్ధికి కషి చేస్తున్న మీలాంటి యువత ఆదర్శమని కేటీఆర్ అభినందించినట్లు మధు తెలిపారు. కేసీఆర్ ప్రభు త్వం తీసుకున్న సంక్షేమ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జాతీయ రజకసంఘాల కో ఆర్డినేటర్ మల్లేష్ కుమార్, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు, రజక సంఘం యూత్ అధ్యక్షుడు నల్లతీగల రాజు, కార్యదర్శి చాకలి వెంకటేష్,తదితరులు ఉన్నారు.