Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకుడి మిస్సింగ్ కేసులో కళ్లు చెదిరే నిజాలు
- తనతోనే గుంట తవ్వించి.. అదే గుంటలో పూడ్చిపెట్టిన దుండగులు
- ఈనెల 10న మిస్సింగ్ కేసు నమోదు
- 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
- యువకుడి హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పారిశ్రామిక వాడ
నవతెలంగాణ-పటాన్చెరు
తెలిసినవాడని అప్పిచ్చి.. తిరిగి అడిగిన పాపానికి ఓ యువకుడు ప్రాణమే పోయింది. అందరి ముందు డబ్బులు అడుగుతున్నాడని.. మరో యువకుడు ఇద్దరితో కలిసి రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. అనాథ శవం కోసమని గుంత తవ్వడానికి పిలిపించి.. అదే గుంతలో పూడ్చిపెట్టారు. ఈ భయానక ఘటనతో పటాన్చెరు పారిశ్రామికవాడ ఒక్క సారిగా ఉలికి పడ్డది. ఈ కేసుకు సంబంధించిన వివరా లను పటాన్చెరు పోలీస్ స్టేషన్లో సీఐ వేణుగోపాల్ రెడ్డితో కలిసి డీఎస్పీ భీమ్ రెడ్డి వెల్లడించారు. ఆయన తెలి పిన వివరాల ప్రకారం...
పటాన్చెరు పట్టణానికి చెందిన మహమ్మద్ సమీర్ అహ్మద్(28)ను అదే పట్టణానికి చెందిన ఇలియాస్ 8 నెలల క్రితం డబ్బులు అడిగాడు. సమీర్ తనకున్న పరిచయస్తుల వద్ద రూ.50,000ను ఇలియాస్‌కు మూడు నెలల వ్యవధి పెట్టి అప్పుగా ఇప్పించాడు. అయితే 8 నెలలైనా అప్పు తీర్చకపోయేసరికి పలుమార్లు ఇలియాస్‌ను సమీర్ డబ్బుల గురించి అడిగాడు.అందరి ముందు డబ్బుల గురించి అడుగుతున్నాడు.. చులకన చేసి మాట్లాడుతున్నాడని సమీర్‌పై ఇలియాస్ కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని తన బావమరిది అయిన రుస్తు అలీ, మరో వ్యక్తి అల్లావు ద్దీన్లకు చెప్పి.. ఎలాగైనా సమీర్‌ను హత్య చేయాలని ఇలియాస్ పథకం రచించారు. పథకంలో భాగంగా ఈనెల 8న ఇలియాస్ ఇద్దరు లేబర్లను తీసుకెళ్లి దర్గా వద్ద గల స్మశానవాటికలో గుంత తవ్వించాడు. అనంతరం సమీర్‌కు ఇలియాస్ ఫోన్ చేసి ఒక బీద ముస్లిం వ్యక్తి శవం వస్తు న్నదని.. అంత్యక్రియల కోసం గుంత తవ్వాలని పిలవగా వెళ్లాడు. ఇద్దరూ కలిసి ముందుగా తవ్విన గుంతను పెద్దది చేసి వచ్చారు. కాగా అదే రోజు రాత్రి హత్య చేయాలని.. సమీర్‌ను స్మశాన వాటికకు రమ్మనగా.. తన మేనల్లుడి పుట్టిన రోజు ఉన్నదని రాలేదు. దీంతో మరుసటి ఉదయం 6.45 ప్రాంతంలో సమీర్‌కు ఇలియాస్ ఫోన్ చేసి.. నిన్న శవం రాలేదు, తవ్విన గుంతను పూడ్చడానికి స్మశాన వాటి కకు రమ్మన్నాడు. దీంతో తన స్కూటీపై సమీర్ ఇంట్లో నుంచి పటాన్చెరు శివారులోని ముస్లిం గ్రేవీ యార్డ్‌కి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఇలియాస్, రుస్తుం అలీ, అల్లా వుద్దీన్లు ఉండగా.. నలుగురూ కలిసి గుంత దగ్గరికి వెళ్లారు. సమీర్ గుంతను పూడ్చుతుండగా వెనకాల నుంచి అల్లావుద్దీన్ పెద్ద రాడ్డుతో సమీర్ తలపై కొట్టాడు. దీంతో అదే గుంతలో సమీర్ పడిపోయాడు. తర్వాత ఇలియాస్, రుస్తుం అలీలు సమీర్‌పై 4 పెద్ద రాళ్లు వేసి అదే గుంతలో పాతి పెట్టారు. అనంతరం మతుడి మోటార్ సైకిల్ (స్కుటి)ని అక్కడ నుంచి కొంత దూరం తీసుకెళ్లి పొలాల్లో దాచిపెట్టారు. మరుసటి రోజు (శనివారం) రాత్రి పెట్రోల్ తీసుకోని వెళ్లి స్కూటిని తగులపెట్టారు. కాగా సమీర్ కనబడడం లేదని అతని తండ్రి సలీం పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఈనెల 10న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఈనెల 12న అనుమానితులైన షేక్ ఇలియాస్, షేక్ రుస్తుం అలీలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో వారు అసలు నిజం ఒప్పుకున్నారు. దర్యాప్తులో భాగంగా పటాన్చెరు తహ సిల్దార్ మహిపాల్ రెడ్డి, ఇద్దరు వైద్య ల బందం సమక్షంలో పాతి పెట్టిన శవాన్ని వెలికితీసి శవ పంచనామా, పోస్ట్ మార్టం చేశారు. నిందితులు షేక్ ఇలియాస్, రుస్తుం అలీల ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, మోటార్ సైకిల్, కీ చైన్, పారను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అల్లావుద్దీన్ కోసం గాలింపు చర్య లు చేపట్టినట్లు తెలిపారు. ఛాలెంజ్ గా తీసుకున్న పటాన్చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి బృందం 48 గంటల్లోనే కేసును ఛేదించడంతో.. డీఎస్పీ భీమ్ రెడ్డి అభినందించారు.