Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వట్పల్లి
వట్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీపీ పత్రి కృష్ణవేణి నర్సింలు అధ్యక్షతన మంగళశారం జరిగిన సర్వసభ్య సమావేశం గరం గరంగా సాగింది. 'మూడు నెలలకొకసారి సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశంలో సమస్యలను ప్రస్తావిం చడమే తప్పా పరిష్కరించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మొక్కుబడిగానే సమావేశాలు జరుగుతున్నాయి తప్ప సమస ్యలు ఎందుకు పరిష్కారము కావడం లేదు.. పరిష్కారం కానప్పుడు సమావేశాలను నిర్వహించడం ఎందుకు.. సమావేశానికి హాజరుకాని అధికారులపై ఏం చర్యలు తీసు కున్నారు' అని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నర్సింలు, గౌతాపూర్ సర్పంచ్ ఖయ్యుం, మంచిర్యాల తాండ సర్పంచ్ దీప్లనాయక్ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం పది రోజుల కిందట సర్వసభ్య సమావేశం ఎజెండాను ప్రతులను అన్ని శాఖల అధికారులకు అందరూ చేసినప్పటికీ సమాy ేశానికి ఆలస్యంగా రావడం ఏంటని అధికారుల తీరుపై ఎంపీపీ పత్రి కృష్ణవేణి నర్సింలు అసహనం వ్యక్తం పరిచారు. పలు గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ కూలీలకు ఆరు నెలలు గడుస్తున్నా డబ్బులు అందకపోవడం ఏమిటని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నర్సింలు, సర్పంచ్ ఖయ్యుం ఈజీఎస్ ఏపీవోను నిలదీశారు. చేపట్టిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతో రహదారుల వెంట చెట్లను నాటేందుకు ఉపాధి కూలీలు రావడంలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. దేవునూర్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహము వార్డెన్ విద్యార్థులకు మెనూ ప్రకారం మెస్ ఇవ్వడం లేదదన్నారు. విద్యార్థులకు జరగరానిది ఏదైనా జరిగితే అందుబాటులో లేని వార్డెన్ నరసింహులు వల్ల ఏమి ఉపjె ూగమన్నారు.ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలే పత్తి పంట వాడి పోతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారని.. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం రైతులకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు అందుబాటులోకి రావడంలేదని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నరసింహులు వ్యవసాయ అధికారి రమేష్ చౌహాన్‌ను సమావేశంలో ప్రశ్నించారు. గ్రామాల్లో కల్తీకల్లు రాజ్యమేలుతుందని ఈత చెట్లు కను మరుగై స్వచ్ఛమైన కల్లు రావడం లేదని.. కల్తీకల్లు పై ఏమి చర్యలు తీసుకుంటారని ఎక్సైజ్ ఎస్ఐను ప్రశ్నించారు. అదేవిధంగా గంజాయి సాగు కూడా కొన్ని గ్రామాలలో సాగుతుందన్నారు. కాగా ఇన్ని సమావేశాలు జరిగిన ఆర్టీసీ అధికారులు సమావేశానికి రాకపోతే బస్సుల విషయం ఎవరిని అడగాలన్నారు. ప్రజాప్రతినిధులు సమస్యన్నింటిని లేవనెత్తడంతో సమావేశం ఆధ్యాంతం వాడీవేడీగా సాగింది. జెడ్పీటీసీ పత్రి అపర్ణ శ్రీకాంత్, తహసీల్దార్ ప్రభు, ఎంపీడీవో జగదీశ్వర్, వైస్ ఎంపీపీ నాగరాణి బస్వరాజ్, ఎంపీవో యూసుబ్, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.