Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ రూరల్
క్రీడలతో శారీరక దారుడ్యంతో పాటు ఎంతో ఉల్లాసంగా ఆరోగ్య వంతులుగా ఉంటారని చదువులలో కూడా చురుకుగా రాణిస్తారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం జిల్లా గిరిజన అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఆశ్రమ పాఠశాలల వసతి గహ విద్యార్ధి, విద్యార్థులకు ఏర్పాటు చేసిన డివిజనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2022-23 లో మాట్లాడుతూ జట్టుగా ఆడితే విజయం తధ్యమని అన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తితో ఆడాలని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులలోని నైపుణ్యాన్ని బయటకు తీయటంతో పాటు వారి మేధాశక్తిని పెంపొందించిన వారమవుతామని అన్నారు. జిల్లా గిరిజన అభివద్ధి అధికారి కేశురాం మాట్లాడుతూ డివిజనల్ స్థాయి క్రీడలలో మొత్తం 9 గిరిజన ఆశ్రమ హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు 7 క్రీడా పోటీలలో పాల్గొన్నారని గెలుపొందిన టీం లను జోనల్ స్థాయి పోటీలకు పంపుతామని అన్నారు. ఆయా క్రీడలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ నాగరాజు, ఏబీసీడీఓ నాగరాజు గౌడ్, జడ్.పి.హెచ్.ఎస్ శ్రీనివాస్ రావు, మదు, మాధవరెడ్డి, మహిపాల్, స్వాతి, శివరాం, సంతోష్, వసతి గృహ సంక్షేమ అధికారులు హాస్టల్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.