Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
పటాన్చెరు నియోజక వర్గంలోని జిన్నారం మండలంలో గల మాధారం గ్రామ అంగన్వాడీ టీచర్ సస్పెన్షన్ను ఎత్తివేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని అంగన్వాడీ ప్రాజెక్ట్ సీడిపివో చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా కోశాధి కారి నర్సింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల పై సస్పెన్షన్ వేటును వెంటనే ఎత్తి వేయాలని డిమా ండ్ చేశారు. 2002లో పటాన్చెరు ప్రాజెక్ట్ ప్రారంభం అయిందన్నారు. అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లపై సస్పెన్షన్ విధించడం సరి కాదని అన్నారు. ఎలాంటి మెమోలు ఇవ్వకుండా టీచర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కనీస సమాచారం తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి మెమోలు ఇవ్వకుండా ఏ రకంగా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. సస్పెన్షన్ను వెంటనే ఎత్తి వేయాలని లేనిపక్షంలో ఆందో ళనలు తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.