Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్
నవతెలంగాణ-మెదక్ టౌన్
తెలంగాణ సాయుధ పోరాటం కేవలం రైతులు, కూలీలు, ప్రజలు పేద ప్రజలు కలిసి దొరలు జమీందారులు జాగిర్దారుల మీద కమ్యూనిస్టు జెండా పట్టుకుని చేసిన పోరాటమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. ఎన్నో వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత నైజాం ప్రభువు కమ్యూనిస్టులకు భయపడి భారత ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్ర బుద్ధితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిని ప్రజలు తిప్పి కొట్టాలని కేవలం తెలంగాణ విలీన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్ రెడ్డి, బస్వరాజు ఉపాధ్యక్షుడు మల్లేశం, నాగరాజు, సహాయ కార్యదర్శులు బాలమని, నాగేందర్ రెడ్డి, కోశాధికారి నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.